వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్ ఒకటిలోకి వచ్చే అంతరించిపోతున్న జాతుల్లో ఉన్న అడవి అలుగు (పెంగోలిన్) జంతువును అటవీ అధికారులు గుర్తించారు.ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రానికి సమీపంలోని పెండల్‌వాడ ఆవాసాల్లో అలుగు సంచరిస్తుండగా గ్రామస్థులు వింత జంతువుగా భావించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి వెళ్లి గ్రామస్థుల సహకారంతో పట్టుకొని మావల ఉద్యానవనంలో వదిలేశారు. చీమలు, చెదలు తిని జీవించే ఇవి ఆదిలాబాద్ అడవుల్లో పది వరకు ఉండవచ్చని ఆదిలాబాద్ అటవీ క్షేత్రాధికారి అప్పయ్య పేర్కొన్నారు.