ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇటీవల మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అధికారులు ఆ గ్రామం చుట్టూ భారీగా పోలీసుల పహారాను ఏర్పాటు చేశారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటికి రాకుండా హెచ్చరికలు జారీ చేశారు.