హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : తెలంగాణలో రైతు ఆత్మహత్యాయత్నం... అడ్డుకున్న తోటి రైతులు

తెలంగాణ10:52 AM IST Apr 07, 2019

సాగునీరు అందక పంటలు ఎండిపోవడంతో ఆ పంటకు నిప్పు అంటించి... ఆత్మహత్య చేసుకోబోయాడు ఆ రైతు. పెద్దపల్లి జిల్లా... మంథని మండలం... నగరం పల్లికి చెందిన పెగడ సంజీవ్ ఐదు ఎకరాల్లో వరి పంటసాగు చేస్తున్నాడు. ఐతే ఆ ప్రాంతమంతా ఎస్సారెస్పీ (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) కెనాల్‌పై ఆధారపడి సాగుచేస్తున్నారు. డి 83 కెనాల్ ద్వారా చివరి ఆయకట్టు ప్రాంతం వరకు నీరు అందక పోవడంతో సంజీవ్‌కి చెందిన ఐదెకరాల పొలం ఎండిపోయింది. అప్పటికే అప్పులు చేసి, వాటికి వడ్డీలు చెల్లించలేక... అప్పులు ఇచ్చిన వాళ్లతో తిట్లు తింటూ... రోజూ నరకం అనుభవిస్తున్న సంజీవ్... బతకడం కంటే చనిపోవడమే మేలనున్నాడు. పంటకు నిప్పు అంటించి... పురుగుల మందు చేత పట్టుకున్నాడు. పంటవైపు ఆకాశంవైపు చూస్తూ ఉండసాగాడు. అక్కడే ఉన్న తోటి రైతులకు అనుమానం వచ్చింది. గబగబా సంజీవ్ దగ్గరకు వెళ్లారు. వాళ్లకు విషయం అర్థమైపోయింది. ఏంటిది అంటూ అతని దగ్గరున్న పురుగు మందు డబ్బాను లాక్కోడానికి ట్రై చేశారు. సంజీవ్ దాన్ని ఇవ్వకుండా... ఏడుస్తూ... తాను చనిపోవాల్సిందే అంటూ వాళ్లతో తన బాధ చెప్పుకున్నాడు. వాళ్లు సంజీవ్ చేతిలోంచీ ఎలాగొలా పురుగు మందు డబ్బాను వెనక్కి లాక్కున్నారు. సంజీవ్‌ను ఓదార్చారు. ఈ పంట పోతే... మరో పంట వస్తుంది... ప్రాణాలు తీసుకుంటావా... వద్దు వద్దు అంటూ ఓదార్చారు. తోటి రైతులే గనక ఆపకపోయి ఉంటే... ఆ విషాద వార్త మనం వినాల్సి వచ్చేదే.

Krishna Kumar N