హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : బీజేపీలో చేరిన డీకే అరుణ... అంతర్మథనంలో కాంగ్రెస్

తెలంగాణ11:34 AM IST Mar 20, 2019

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కి పరాజయం ఇవ్వడం మాత్రమే కాదు... ఆ పార్టీలో కాన్ఫిడెన్స్‌ని కూడా చంపేశాయి. వచ్చే ఐదేళ్లపాటూ ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుందన్న ఉద్దేశంతో... అది నచ్చని నేతలంతా... పోటీ పడి మరీ ప్రత్యర్థి పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఎక్కువ మంది టీఆర్ఎస్ కండువాలు కప్పుకుంటుంటే... కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి, సీనియర్ లీడర్ డీకే అరుణ మాత్రం బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలో మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. మొదట్నుంచీ కాంగ్రెస్‌లోనే ఉన్న ఆమె... సరిగ్గా లోక్‌సభ ఎన్నికల టైమ్‌లో తన కెరీర్‌ను చక్కదిద్దుకుంటూ... బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కి షాకింగ్ న్యూస్ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల సెగ్మెంట్ నుంచి పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ చేతిలో అరుణ ఓడిపోయారు. అది ఆమెలో తీవ్ర నిరాశ కలిగించింది. అప్పటి నుంచీ ఆమె... కాంగ్రెస్‌లో ఉన్నా... లేనట్లుగా ఉంటున్నారు. ఇప్పుడు నామినేషన్ల ఘట్టం నడుస్తుండటంతో... చాలా మంది నేతలలాగే ఆమె కూడా హస్తానికి హ్యాండిచ్చారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ బరిలో దిగుతారని తెలిసింది.

Krishna Kumar N