హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: శునకం పాలు ....కోడి మురిపాలు

తెలంగాణ18:56 PM August 02, 2019

సాధారణంగా కోళ్లకు, కుక్కలకు అస్సలు పడదు. కుక్కలు పదే పదే కోళ్లను వెంబడిస్తూ ఉంటాయి. ఒకవేళ కోడి చిక్కితే కరిచి తింటాయి. అలాంటి కుక్క, కోడి మధ్య స్నేహం ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నాగారం గ్రామంలో ఓ కోడి కుక్క మాత్రం తమ జాతి లక్షణాలుకు భిన్నంగా ప్రవర్తిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నాగారం మాజీ ఎంపిటిసి సభ్యులు మక్కూరి నాగయ్య తన వ్యవసాయ క్షేత్రంలో కుక్క, కోడిని పెంచుతున్నారు. కుక్క ఐదు పిల్లలకు జన్మనిస్తే అదే ఇంట్లో ఉంటున్న కోడి ఆ కుక్కపిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటోంది. కుక్క బయటకి వెళ్తే చాలు, పిల్లల్ని కోడి తన రెక్కల కింద పడుకోబెట్టుకుని ప్రేమగా చూసుకుంటోంది. జాతి విభేదాలు పట్టింపు మచ్చుకైన కానరాని చిత్రాలివి. . కోడి దాదాపు 20 గుడ్లలు పెట్టగా ఎప్పటికప్పుడు వారు గుడ్లను తీసుకునేవారు ఆ కోడి కుడును పొదిగేందుకు తన నివాస స్థలిలో గుడ్లు లేవు.. ఆయన పెంచుకుంటున్న కుక్క ఆ కోడి గుడ్ల దగ్గరకు వెళ్లి 5 పిల్లలను ఈనింది అప్పటి నుంచి కుక్క తన పిల్లలకు పాలు ఇస్తున్నంతసేపు కోడి అక్కడే కాపలాగా ఉంటుంది. తల్లి కుక్క కోడిని ఏమి అనడంలేదు అది వెళ్లిపోగానే కుక్క పిల్లలను తన రెక్కల కింద పొదుగుతుంన్నట్లుగా కప్పేసి కుర్చుంటొంది. పిల్లల దగ్గరికి ఎవరు వచ్చిన తల్లి కుక్కలాగే కోడి కూడా వెంబడిస్తుంది. అవి అన్యోన్యంగా ఉంటున్నాయి. ఇక కుక్క, కోడి ఫ్రెండ్‌ షిప్‌ భలేగా ఉందే అనుకుంటూ పక్కగ్రామాల ప్రజలు వచ్చి చూసి వెళ్తున్నారు.

webtech_news18