ఆర్మూర్లో గెలిచిన బీజేపీ కౌన్సిలర్ ని టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పారని, వారిని వెనక్కు పంపకపోతే సీఎం కేసీఆర్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో పాల్గొన్న ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. బీజేపీకి సరైన బలం లేకపోవడం వల్ల మేయర్ గా ఓడిపోయామన్నారు.