గత పది సంవత్సరాల నుంచి కామారెడ్డిలో ఉంటున్నా తమకు లాక్డౌన్ సమయంలో గది ఇచ్చి ఇప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోవాలని అంటున్నారని, ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను తెలుపుదామంటే కలవనివ్వడం లేదని హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం వెంటనే డబుల్‌బెడ్ రూం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నామన్నారు.