హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : కరీంనగర్‌లో ఎంపీ బండి సంజయ్ ఆందోళన... ఉద్రిక్తత

తెలంగాణ07:14 AM November 02, 2019

కరీంనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీద సివిల్ డ్రెస్సులో ఉన్న ఓ పోలీసు అధికారి చేయిచేసుకున్నారన్న దానిపై దుమారం రేగింది. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ సీపీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఓ దశలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కమిషనర్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది. పోలీసుల భౌతిక దాడిని ఎంపీ బండి సంజయ్ ఖండించారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరిని దేశం ముందు పెడతామన్నారు. దీనిపై పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ పెడతామని తెలిపారు.

webtech_news18