HOME » VIDEOS » Telangana

Video : భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్‌కౌంటర్.. పోలీసులపై తిరగబడ్డ గ్రామస్తులు

తెలంగాణ17:10 PM July 31, 2019

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన లింగన్న దళంలోని ఓ మావోయిస్టును పోలీసులు కాల్చి చంపారు.దళంలోని మిగతా ఏడుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.అయితే ఎన్‌కౌంటర్ బూటకం అని న్యూడెమోక్రసీ నేతలు వాదిస్తున్నారు.దొరికిన మావోయిస్టును చిత్రహింసలు పెట్టి ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో రోళ్లగడ్డ గ్రామస్తులు అక్కడికి వచ్చిన పోలీసులపై తిరగబడ్డారు. కూంబింగ్ పేరుతో వచ్చిన పోలీసులను చితకబాదారు.వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు అక్కడినుంచి పారిపోయి బయటపడ్డారు.కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న లింగన్న దళ సభ్యులకు ఎటువంటి హాని తలపెట్టవద్దని న్యూడెమెక్రసీ నేతలు వారికి విజ్ఞప్తి చేశారు.

webtech_news18

Top Stories