ఇన్నాళ్లూ మొబైళ్లలో, బ్యాగుల్లో, షూస్ అడుగు భాగంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ చాలా మంది దొరికిపోవడం చూశాం. ఇది మరో రకం. విదేశాల నుంచీ హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుణ్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు పట్టుకున్నారు. అతని దగ్గరున్న ఇనుప రాడ్డులను పగలగొట్టి చూశారు. మైండ్ బ్లాంకైంది. రాడ్డుల మధ్యలో బంగారం దాచి, స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. మొత్తం 2 కేజీల 300 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు... స్మగ్లర్ను అరెస్టు చేశారు.