హోమ్ » వీడియోలు » తెలంగాణ

తమ్ముడి కోసం జీవితాన్నే త్యాగం చేసిన అక్క...

తెలంగాణ22:14 PM August 22, 2019

కని పెంచిన తల్లిదండ్రులనే వదిలేస్తున్న రోజులివి. కానీ తమ్ముడి కోసం ఆ అక్క తన జీవితాన్నే త్యాగం చేసింది. 24 ఏళ్లుగా మంచానికే పరిమితమైన తమ్ముడిని .. బీడీలను చుడుతూ పోషిస్తోంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ గ్రామానికి చెందిన రమేష్ కు 1996లో విద్యుత్ షాక్ కొట్టడంతో వెన్నెముకకు తీవ్రగాయమైంది. కాళ్లు చచ్చుపడిపోయాయి. అతడి వైద్యం చికిత్సల కోసం ఉన్న ఆస్తినంతా అమ్మేశారు. జీవచ్ఛవంలా మారిన కొడుకును చూసి మనోవేదనతో తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచీ రమేశ్ బాగోగులను అతడి అక్క ఇందిర చూసుకుంటోంది. పెళ్లి కూడా చేసుకోకుండా తమ్ముడికి సపర్యలు చేస్తోంది. బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషిస్తోంది. ఐతే ఆ డబ్బులు మందులకు కూడా సరిపోవడం లేదని ఎవరైనా దాతలు ఆర్థిక సాయం చేయాలని కోరుతోంది.

webtech_news18