పసుపు బోర్డు, పసుపు పంటకు మద్దత్తు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ఆత్మగౌరవ పాదయాత్ర నేటితో ముగిసింది. గత మూడురోజుల క్రితం ఎల్కాటూర్ గ్రామంలో ప్రారంభించిన రైతు జేఏసీ నాయకులు మూడు మండలాలు 10 గ్రామాల్లో పాదయాత్ర చేసి పసుపు రైతుల నుండి వినతులు, డిమాండ్లను తెలుసుకొన్నారు. ప్రతి గ్రామంలో పసుపు రైతులు పసుపు బోర్డు, మద్దతు ధర కావాలని డిమాండ్ చేసినట్లు రైతు జేఏసీ నాయకులు తెలిపారు. నేడు ముప్కల్ మండలం వెంచిర్యాల గ్రామాల్లో ఈ ఆత్మగౌరవ పాదయాత్ర ముగించారు. ఈ మూడు రోజుల పాదయాత్రలోని అనుభవాలను రైతు జేఏసీ సమావేశంలో చర్చించుకొని తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు..