ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు.. అని ఎదురుచూడకుండా వారి ఊరిని వారే అభివృద్ధి చేసుకుని చూపించారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం చల్లగరిగ గ్రామస్థులు. వర్షాల్లేక కరువులో ఉన్న ఊరిని మార్చేందుకు గల్ఫ్ వెళ్లిన వారంతా.. 11మందితో కలిసి ధరణి అనే స్వచ్చంధ సంస్థ ఏర్పాటు చేసి .. దీని ద్వారా వాటర్ ట్యాంక్, మహాదేవుని ఆలయం, స్థానిక ప్రాథమిక పాఠశాల డెస్క్, బెంచీలు నిర్మించి పిల్లలకు యూనిఫాంలు సరఫరా చేశారు. 150మందికి చేరిన ధరణి సంస్థ సభ్యులు రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.