భానుడు ఇంకా పూర్తి స్థాయిలో భగ్గుమనలేదు. అప్పుడే నీటి కష్టాలు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మునిసిపల్ కేంద్రాల్లో ఈ పరిస్థితి నెలకొంటోంది. పట్టణంలోని పలు వార్డులను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన 4వ వార్డుకు రాగా.. కాలనీవాసులు, మహిళలు మంచినీళ్ల సదుపాయం లేదని ఖాళీ బిందెలతో ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు.