హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : పుట్టిన పసికందు మృతి... డాక్టర్ల నిర్లక్ష్యమే ప్రాణం తీసిందా...

తెలంగాణ18:52 PM April 16, 2019

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో పుట్టిన శిశువు కొన్ని గంటల్లోనే మృతి చెందింది. బీడీ కాలనీకి చెందిన సత్యనారాయణ తన భార్య రాధను డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. రాధకు ఆపరేషన్ చేయడంతో మగ శిశువు జన్మించింది. ఉమ్మనీరు మింగడం వల్ల శిశు పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హైదరాబాద్ తరలించాలని డాక్టర్లు సూచించారు. శిశువును హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు చేయగా శిశువు మృతి చెందిందని తెలిసింది. దీనికి కారణం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్లే అని ఆరోపిస్తూ బంధువులు మృతి చెందిన శిశువుతో ఆస్పత్రి ముందు రాస్తారోకో చేశారు.

Krishna Kumar N