Telangana: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లలో కాలక్షేపం చేస్తుంటారు చాలా మంది. మనలో చాలా మంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయినా ఉపయోగిస్తున్నాం. అయితే ఫోన్ ద్వారా ఎన్ని ప్రయోజనాలున్నాయో, అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. చాలా మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు. దీని వల్ల చాలా దారుణాలు జరుగుతున్నాయ్.