హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : తెలంగాణలో ఘనంగా నాగోబా జాతర

తెలంగాణ13:43 PM January 24, 2020

తెలంగాణలో సమ్మక్క సారలమ్మ తర్వాత అంతటి పెద్ద జాతర నాగోబా జాతర. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ జాతరకు... ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా సన్నిధిలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇప్పటికే గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశ గిరిజనులు ఆలయ సమీపంలోని మర్రి చెట్టు కింద విడిది చేశారు. ఈ రోజు రాత్రి 10 గంటలకు గంగా జలంతో ఆలయాన్ని శుద్ధి చేసి, నాగోబాకు జలాభిషేకం చేసి మహపూజను ప్రారంభించనున్నారు. ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మెస్రం వంశస్థులతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి భారీగా తరలిరానున్నారు. కాగా ఈ జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.26 లక్షలు ఇచ్చింది. ఉట్నూరు ఐటిడిఎ అధ్యర్యంలో ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బందులేవీ కలుగకుండా ఏర్పాట్లు చేస్తోంది. జాతర సందర్భంగా ఇక్కడ వివిధ దుకాణాలు వెలిశాయి. తాగు నీరు, రాత్రి ఇక్కడ బస చేసేవారికి ఇబ్బంది లేకుండా విద్యుత్ సౌకర్యాల్ని కల్పించారు. ఈ జాతర సందర్భంగా గిరిజనులు తమ ఆరాధ్య దైవానికి చేసే పూజలు, చెల్లించుకునే మొక్కులు వారి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.

webtech_news18