పౌరసత్వ సవరణ చట్టం( సీఏఏ), జాతీయ పౌరపట్టిక( ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన సభకు ముస్లింలు పోటెత్తారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ధర్నాచౌక్ వద్ద కేవలం సభకు మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. ఇందిరాపార్కు వద్ద సభావేధికకు ముస్లింలు ర్యాలీగా తరలివచ్చారు. భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిర్వహించిన ఈ ర్యాలీ జనసంద్రంగా మారింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి ట్యాంక్‌బండ్ వరకు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.