రంగారెడ్డి జిల్లా... మొయినాబాద్ మండలం... IITCలో పోలీసింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన 37 కుక్కలతో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్కి సి.వి.ఆనంద్, ఐజీ ఇంటెలిజెన్స్ నవీన్ చంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇప్పటివరకు 885 కుక్కలకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. దేశంలోనే అత్యున్నత జాగిలాల శిక్షణా సంస్థగా ఇది గుర్తింపు పొందింది. ఇక్కడ ట్రైనింగ్ పొందిన కుక్కలు తెలంగాణలో చాలా కీలక కేసుల్ని పోలీసులు ఛేదించేందుకు సాయపడ్డాయి.