గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, తెలంగాణ అపర్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ప్రజల క్షేమం కోరి మోదీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు తగ్గించిందని, మరి కేసీఆర్‌కు ఆ దమ్ముందా అని ఛాలెంజ్ చేశారు. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపడం ఇష్టం లేక పెట్రోల్‌పై రెండు రూపాయలు తగ్గించాయని, కేసీఆర్‌కు అలా చేసే ఆలోచన ఉందా... అని నిలదీశారు రాజాసింగ్.