విపత్తు సమయంలో ఎలా స్పందించాలి అనే అంశంపై హైదరాబాద్‌లో యశోదా ఆస్పత్రి మాక్ డ్రిల్ చేసింది. ఐతే... ఉద్యోగులు ఆఫీసులకీ, విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సమయంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రద్దీ సమయంలో ఇదేంటని... ఇది మాక్ డ్రిల్లా లేదనీ... సినిమా షూటింగ్‌లా ఉందని ప్రయాణికులు ఫైర్ అయ్యారు.