కరోనా వైరస్ ప్రబలకుండా లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో 261 మొబైల్ రైతుబజార్లతో జంటనగరాలలో 516 ప్రాంతాలలో కూరగాయలు, 13 మొబైల్ రైతుబజార్లతో పండ్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తెలిపారు. కాలనీల వాసులు కలిసికట్టుగా సమన్వయం చేసుకుని సమాచారం ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.