హైదరాబాద్ కాచీగూడ రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్‌పై ఉన్న బోగీలు పక్కకు ఒరిగాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగివున్న ట్రైన్‌ను వెనకనుంచి వస్తున్న మరో ఎంఎంటిఎస్ ట్రైన్.. ఢీకొట్టింది. ఈ ఘటనలో 30కు పైగా మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రైల్వే జీఆర్పీ పోలీసులు.... ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.