హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థికి స్కూల్లోకి నో ఎంట్రీ

తెలంగాణ19:34 PM December 03, 2019

అయ్యప్ప మాల వేసుకున్నాడన్న కారణంతో విద్యార్థిని స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. మాలలో ఉండే 41 రోజులు స్కూల్‌కు రాకూడదని హుకూం జారీ చేసింది. భువనగిరిలో ఈ ఘటన జరిగింది. ప్రణీత్ రెడ్డి అనే విద్యార్థి ఇండియన్ మిషన్ హై స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఇటీవల అయ్యప్ప మాల వేసుకోవడంతో అతడిపై స్కూల్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు స్కూల్‌కు రావొద్దని ఆదేశించింది. గత 16 రోజులుగా ప్రణీత్ రెడ్డిని స్కూల్‌లోకి అనుమతించడం లేదని అతడి తండ్రి శివారెడ్డి ఆరోపించారు. పాఠశాల యాజమాన్యం తీరును అయ్యప్ప భక్తులు ఖండించారు. అయ్యప్ప భజన మండలి, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్కూలు ముందు 50 మంది భక్తులు ఆందోళన చేశారు. దీనిపై వివరణ కోరగా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్లిన ప్రిన్సిపాల్ తిరిగి స్కూల్‌కు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading