తమ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టిన విషయం మనకు తెలుసు. ఈ క్రమంలో చాలా బస్సు డిపోలకే పరిమితం అయ్యాయి. ఐతే... పెద్దపల్లి జిల్లా... మంథని మండలం... మల్లెపల్లి గ్రామ రోడ్డుపై ఓ బస్సు చిక్కుల్లో పడింది. గోదావరి ఖని నుంచి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై దుండగులు దాడి చేశారు. బస్సు అద్దం పగలగొట్టారు. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారికి గాయాలయ్యాయి. కేసు రాసిన పోలీసులు... దుండగుల కోసం వేటాడుతున్నారు.