వరంగల్ రూరల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రంలో మంత్రి గౌరవ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూరగాయల మార్కెట్ ని ఆకస్మికంగా తనిఖీచేశారు. ప్రజలతో మాట్లాడి, ధరలు అందుబాటులో ఉన్నాయా అని ... కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్నారు. అధిక ధరలకు కూరగాయలు ఎవరైనా అమ్మినా, బ్లాక్ మార్కెట్ కి తరలించినా వారికి కఠిన శిక్షలు తప్పవని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.