హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: మహిళా భద్రతపై మంత్రి కేటీఆర్ సమీక్ష...

తెలంగాణ21:31 PM December 05, 2019

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహిళల భద్రతకు సంబంధించి తీసుకుంటున్న చర్యల మీద చర్చించారు. మద్యం తాగి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వైన్‌షాప్‌లను కూడా మూసేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రతను పెంచాల్సిందిగా సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్న పాత, వినియోగంలో లేని భవనాలను గుర్తించి వాటి యజమానులకు జరిమానా వేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.

webtech_news18