హైదరాబాద్లో టీఎన్జీవో హైదరాబాద్ శాఖ 2020 డైరీ, క్యాలెండర్ను మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోలు కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. అసెంబ్లీ, సచివాలయాల్లో తెలంగాణ పదాన్ని నిషేధించినా... టీఎన్జీవో తన పేరులో తెలంగాణను పెట్టుకుందని ప్రశంసలు కురిపించారు హరీష్ రావు.