కరీంనగర్లో పర్యటించిన పలువురు విదేశీయులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో... నగరంలో ఇప్పటి వరకు లక్ష 27వేల 245 మందిని స్క్రీనింగ్ చేశామని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. కరోనా లక్షణాలు ఉన్న నలుగురికి స్వాప్ శాంపిల్స్ తీశామని అన్నారు. ఈరోజు 35 మందికి స్వాప్ శాంపిల్స్ తీశామని... అందులో ఇండొనేషన్ వ్యక్తితో కలిపి ఇద్దరికి కరోనా లక్షణాలు ఉన్నాయని అన్నారు. వారిలో ఒక వ్యక్తి థాయిలాండ్ నుంచి.. మరో వ్యక్తి ఇటలీ నుండి వచ్చారని అన్నారు. మొత్తం కరోనా లక్షణాలు ఉన్న వారిని హాస్పిటల్ క్వారంటైన్ చేశామని మంత్రి తెలిపారు.