కరీంనగర్ జిల్లా... హుజూరాబాద్ మండలం... ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పర్కల రవిగౌడ్.... ఆత్మహత్య చేసుకోవాలని పురుగుల మందు తాగాడు. స్థానికులు ఆయన్ను హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. సమస్యేంటంటే... జున్నోజు భాస్కర్ అనే ఓ కోటీశ్వరుడు... మాయమాటలు చెప్పి తన భూమిని కాజేశాడని రవిగౌడ్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే భార్య, కొడుకు లేని ఆయన్ను సొంత బావ పల్లె వీరయ్య గౌడ్ కూడా మోసం చేశారని తెలిసింది. ఫిబ్రవరి 29న శనివారం భూమి విషయమై... స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లి... సీఐకి కంప్లైంట్ ఇచ్చినా ఫలితం కలగలేదన్న బాధితుడు... ఆత్మహత్యకు యత్నించడం స్థానికుల్ని కలచివేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ని కాపాడి... పోలీసులు తగిన న్యాయం చెయ్యాలంటున్నారు స్థానికులు.