హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : కేసీఆర్‌కి గుడి కట్టి... ఆత్మహత్యాయత్నం

తెలంగాణ13:03 PM November 15, 2019

ప్రగతి భవన్ ముందు ఓ పెద్దాయన విషం బాటిల్‌తో కనిపించడం కలకలం రేపింది. ఆత్మహత్యకు యత్నిస్తున్న ఆయన్ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయమేంటని అడిగితే... ఓ రౌడీషీటర్ తనను వేధిస్తున్నందువల్ల చనిపోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఆ పెద్దాయన పేరు రవీందర్. మంచీర్యాల జిల్లాకు చెందినవాడు. 2001 నుంచీ టీఆర్ఎస్ కార్యకర్త. తన ఊళ్లో సీఎం కేసీఆర్‌కి గుడి కూడా కట్టాడు. అక్కడే కేబుల్ నెట్‌వర్క్ నడుపుతున్నాడు. అక్కడి ఓ రౌడీషీటర్ ఇప్పుడా కేబుల్ నెట్‌వర్క్‌ను ఆక్రమించాడు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే, ఎంపీలకు చెప్పినా పట్టించుకోలేదు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా నో డెవలప్‌మెంట్. లాభం లేదనుకున్న పెద్దాయన... ప్రగతిభవన్‌కి వచ్చి... విషం బాటిల్ బయటకు తీశాడు. అసలే ఈ మధ్య బాటిళ్ల కలకలం బాగా ఉండటంతో... సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రవీందర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

webtech_news18