హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ప్రియుడి మోసం.. ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

తెలంగాణ20:17 PM April 19, 2019

ప్రేమించి మోసం చేశాడన్న కారణంగా ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రియురాలు ధర్నాకు దిగిన ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం కూర్మగూడ గ్రామంలో చోటు చేసుకుంది. కూర్మగూడ గ్రామానికి చెందిన గాధర్ల మహేష్.. అదే గ్రామానికి చెందిన బీడీ వసంత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లికి మాత్రం మహేష్ నిరాకరించడంతో కన్నెపెల్లి ఎస్ఐ రాజ్ కుమార్‌కి వసంత పిర్యాదు చేసింది. కానీ ఎస్ఐ రాజ్‌కుమార్ మాత్రం మహేష్‌కే సహకరించాడని.. తనకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆమె ఆరోపిస్తోంది. ఇదే క్రమంలో మహేష్ మరో పెళ్లికి సిద్దమవడంతో మహిళా సంఘాలతో కలిసి అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. వసంత తమ ఇంటి ముందు ధర్నాకు దిగడంతో మహేష్ కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేసి చితకబాదారు. మహిళా సంఘాల నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు. అయితే వసంత మాత్రం తనకు న్యాయం జరిగేవరకు పోరాడుతానని చెబుతోంది.

webtech_news18