ఆదిలాబాద్ జిల్లా బేల మండలం జునొని గ్రామ శివారులో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇందులో ఒకరు బేలకు చెందిన కానక దేవిక కాగా మరొకరు జునొని గ్రామానికి చెందిన ప్రమీల. మండలంలోని జునొని వీరిద్దరూ పంట చేనులో పత్తి ఏరడానికని కూలి పనులకు వెళ్లగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో మహిళలు వేప చెట్టు కిందికి వెళ్ళారు. అదే సమయంలో పిడుగు పడడంతొ ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ప్రాణాప్రాయం నుండి బయటపడ్డారు.