కాప్రాలో ఘోర సంఘటన జరిగింది. అతివేగంగా వెళ్తున్న ట్రక్కు.. స్కూటీపై వెళ్తున్న మహిళను ఢీకొట్టింది. తలపై నుంచి ట్రక్కు టైరు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. హెల్మెట్‌తో పాటు ఆ మహిళ తల ఛిద్రమైంది. ఏఎస్రావు నగర్‌లోని రాధిక థియేటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.