HOME » VIDEOS » Telangana

Video: అమ్మ ప్రేమంటే ఇదే..ఏడుస్తున్న శిశువుకు చనుపాలు పట్టిన కానిస్టేబుల్

తెలంగాణ16:33 PM January 01, 2019

ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్న శిశువుకు చనుపాలు పట్టి తల్లి ప్రేమను చాటుకుంది ఓ కానిస్టేబుల్. హైదరాబాద్‌లోని బేగంబజార్ ప్రాంతంలో ఓ వ్యక్తికి.. ఓ మహిళ శిశువును అప్పజెప్పింది. ఇప్పుడే వస్తాను..కాసేపు ఎత్తుకొమ్మని చెప్పి వెళ్లిపోయింది. ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో శిశువును అప్పగించాడు. ఐతే పాప గుక్కపట్టి ఏడుస్తుండడంతో కానిస్టేబుల్ రవీందర్.. భార్య ప్రియాంకకు ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పాడు. తాను కూడా కానిస్టేబులే. ప్రస్తుతం మెటర్నిటీ లీవ్‌లో ఉంది.భర్త ఫోన్ చేయడంతో వెంటనే పీఎస్‌కు వెళ్లి..ఏడుస్తున్న శిశువుకు చనుపాలు పట్టింది. కానిస్టేబుల్ దంపతులను ఉన్నతాధికారులు అభినందించారు.

webtech_news18

Top Stories