కాశ్మీరీ పండిట్ల అమరవీరుల దినోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉన్న కాశ్మీరీ పండిట్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 1989లో సెప్టెంబర్ 14న బీజేపీ ప్రముఖ నాయకుడు, కాశ్మీరీ పండిట్ల ఆరాధ్య నేత టీకా లాల్ టప్లూను జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన కొందరు హత్య చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా బలిదాన్ దివస్ నిర్వహిస్తారు.