పోలీస్ స్టేషన్లో కాంట్రాక్టర్ పుట్టినరోజు వేడుకల్నీ దగ్గరుండి జరిపించారు పోలీసులు. వివరాల్లోకి వేళ్తే.. కరీంనగర్ జిల్లా మానుకొండూరు పోలీస్ స్టేషన్లో ఈ నెల 4న వీణవంక మండలం గంగారంకు చెందిన నల్లా ప్రసన్న కుమార్ అనే కాంట్రాక్టర్ పుట్టినరోజు వేడుకల్నీ నిర్వహించారు. అయితే ఇక్కడ విశేషం ఏమంటే..స్టేషన్ సీఐ రవీందర్రెడ్డి దగ్గరుండీ.. తన కేబిన్లో ప్రసన్నకుమార్తో కేక్ కట్ చేయించడం. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ వ్యక్తుల పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఏంటనీ ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.