హోమ్ » వీడియోలు » తెలంగాణ

పురుషులతో సమానంగా అక్కడి మహిళలు..హమాలీ పనులు చేస్తూ అదరగొడుతున్నారు

తెలంగాణ12:24 PM June 06, 2019

పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని మనం తరచు అంటుంటాం.. అయితే ఆ గ్రామ మహిళలు దీన్ని అక్షరాల నిజం చేస్తున్నారు, కామారెడ్డి జిల్లాలోని  నాగిరెడ్డిపేట్ మండలం, రాఘవపూర్ గ్రామం మహిళలు. అక్కడి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ వీరు ఎంతో కీలకంగా మారారు. కొనుగోలు సెంటర్ల నిర్వహణ మాత్రమే కాకుండా హమాలీ పని కూడా మహిళలే చేస్తూ..పురుషులకు ఏమాత్రం తక్కువ కాదు అని చెబుతున్నారు ఇక్కడి మహిళలు. ధాన్యాన్ని బస్తాల్లో నింపడం, తూకాలు వేయడం, లారీల్లోకి ఎక్కించడం వంటి పనులను సునాయాసంగా చేసేస్తున్నారు.. వ్యవసాయ పనులు లేని సమయంలో ఈ రకంగా ఉపాధి పొందుతున్నామని చెప్తున్నారు. ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ మహిళలు.

webtech_news18