HOME » VIDEOS » Telangana

వలస కూలీల కడుపు నింపుతున్న కల్వకుంట్ల కవిత...

తెలంగాణ18:48 PM April 02, 2020

గత రెండు సంవత్సరాలుగా నిజామాబాద్ , బోధన్, ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రుల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కల్వకుంట్ల కవిత, ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేందుకు గాను మరో మూడు కొత్త అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు, లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలస కూలీలు పడుతున్న ఇబ్బందులను స్థానిక ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రజలు కవిత దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే దీనిపై దృష్టి సారించిన కల్వకుంట్ల కవిత, ఆయా ప్రాంతాల్లో అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులతో చర్చించి, అవసరమైన చోట అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేయించారు.

webtech_news18

Top Stories