రేవంత్ రెడ్డి అరెస్టు కి నిరసనగా శుక్రవారం మధ్యాహ్నం కెయూ గేట్ 2 ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మను విద్యార్థి సంఘాలు దహనం చేశారు. రేవంత్ రెడ్డి ని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసారు. రేవంత్ రెడ్డి పై బనాయించిన అక్రమ కెసుల్ని వెంటనే ఉపసహరించుకోవాలని తెలిపారు.