శంషాబాద్లో యువ వెటర్నరీ వైద్యురాలి హత్యోదంతంపై నిరసనలు కొనసాగుతున్నాయి. నిందితులను వెంటనే శిక్షించి బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ ఇవాంజెలిస్ట్ కేఏ పాల్ స్పందించారు. దోషులను బెయిల్ పై వదిలి వేయకుండా, హంతకులను ఆరు నెలల్లోగా కఠినమైన శిక్షలు అమలు చేయాలని పాల్ డిమాండ్ చేశాడు. అంతేకాదు సమాజంలో స్త్రీలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశాడు.