హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ఆ జవాన్ తండ్రి ఏమయ్యారు?... మిస్సింగ్ వెనక భూ కబ్జాదారుల పాత్ర ఎంత?

తెలంగాణ11:46 AM July 06, 2019

Telangana : ఆదివారం మధ్యాహ్నం నుంచీ సప్పేట సాయి రెడ్డి కనిపించట్లేదు. తమ భూమిని ఆక్రమించిన కబ్జాదారులే ఆయన్ని కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. గత నెల్లో 26 ఏళ్ల జవాన్ సప్పేట స్వామి... భూ ఆక్రమణదారుల వల్ల తమ కుటుంబానికి హాని ఉందంటూ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది వైరల్ అయ్యింది. రెండు వారాల తర్వాత కామారెడ్డి జిల్లా... తాడ్వాయ్ మండలం... చిట్యాల గ్రామం నుంచీ సప్పేట స్వామి తండ్రి, 48 ఏళ్ల సప్పేట సాయి రెడ్డి కనిపించట్లేదు. తమ ఆరు ఎకరాల భూమిని కాజేసిన కబ్జాదారులే కిడ్నాప్ చేశారంటున్న ఫ్యామిలీ ఇప్పుడు తీవ్ర ఆందోళన, ఆవేదనలో ఉంది. తన తండ్రిని కనిపెట్టేందుకు జమ్మూకాశ్మీర్‌లోని తన పోస్ట్ నుంచీ బుధవారం తెలంగాణకు వచ్చాడు స్వామి. మరో వీడియో రిలీజ్ చేశాడు. తను మొదటి వీడియోలో చెప్పినట్లే జరిగిందని, రెండో వీడియోలో తెలిపాడు. తమ వ్యవసాయ భూమిని పిప్పిరి ఆంజనేయులు కాజేశాడని మొదటి వీడియోలో చెప్పిన స్వామి... ఆ భూమిలో అడుగుపెడితే చంపేస్తానని తన తల్లిదండ్రుల్ని ఆంజనేయులు బెదిరించినట్లు తెలిపాడు. ఆదివారం ఉదయం 9 గంటలకు తన తండ్రితో మాట్లాడానన్న స్వామి... మధ్యాహ్నం వేళ ఆయన ఇంటి నుంచీ బయటకు వెళ్లారనీ... ఆ తర్వాత తిరిగి రాలేదని స్వామి వివరించాడు. తన తండ్రి ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందన్న స్వామి... చార్జింగ్ అయిపోవడం వల్ల అది స్విచ్ఛాఫ్ అయివుంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు. ఆయన ఎప్పుడు తిరిగి వస్తారా అని కుటుంబమంతా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు స్వామి. ప్రస్తుతం తాడ్వాయ్ పోలీస్ స్టేషన్‌లో సప్పేట సాయిరెడ్డిపై మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. అనుమానితులుగా ఎవరి పేరూ చెప్పలేదన్న స్వామి... అలా చెబితే... పోలీసులు వాళ్లను ఎంక్వైరీ చేస్తే... ఆ తర్వాత తమ పలుకుబడితో... వాళ్లు తమకు హాని చేసే ప్రమాదం ఉందన్నాడు. భూమిని కబ్జా చేసిన వాళ్లను ప్రశ్నిస్తే, తన తండ్రి ఆచూకీ దొరికే అవకాశం ఉందన్నాడు. తొలి వీడియో వైరల్ అయిన తర్వాత... ఈ కేసుపై ఎంక్వైరీకి ఆదేశించారు జిల్లా కలెక్టర్. ఐతే... అధికారులు ఆ దిశగా దర్యాప్తు సాగించట్లేదనీ, సివిల్ కోర్టులో మేటర్ సెటిల్ చేసుకోమని సూచిస్తున్నారనీ జవాన్ స్వామి అంటున్నాడు. సివిల్ కోర్టుకు వెళ్లేంత స్థోమత తమకు లేదంటున్నాడు. ఇలా ఓ భూ ఆక్రమణ వివాదం... ఆ ఫ్యామిలీకి క్షణక్షణం నరకం చూపిస్తోంది.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading