టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు చేపట్టింది. జూబ్లీహిల్స్, ఖమ్మంలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఏక కాలంలో దాడులు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.