కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని భీమన్ గొందికి చెందిన మడావి కన్నీబాయి సాహస కృత్యాలకు చిరునామాగా నిలుస్తోంది. మారుమూల గిరిజన గూడేనికి చెందిన ఈ కోలామ్ యువతి ఇటీవల కటిక జలపాతంలో జరిగిన ప్రపంచ స్థాయి వాటర్ రాఫెల్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకాన్ని గెలుచుకుంది. 18 దేశాలతో పోటీ పడి కళ్ళకు గంతలు కట్టుకొని జలపాతం ఎక్కడం దిగడంతో బంగారు పతకాన్ని సాధించింది. సాహస కృత్యాల్లో పాల్గొంటూ ప్రతిభను కనబరిచి పతకాలను సాధించిన ఈ కోలామ్ గిరిజన యువతిని తెలంగాణ సాహస క్రీడలకు అంబాసిడర్ ప్రకటించారు.