హైదరాబాద్... సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కి మంచి స్పందన వస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి... రకరకాల రంగుల పతంగులను చూస్తున్నారు. అక్కడి ప్రత్యేక స్వీట్ స్టాళ్లలో ఏర్పాటు చేసిన స్వీట్లను కొని టేస్ట్ చూస్తున్నారు. మూడ్రోజులపాటూ జరిగే ఈ పెస్టివల్... జనవరి 15 రాత్రితో ముగుస్తుంది. రాత్రివేళ కూడా లైటింగ్ పతంగులు ఎగరేస్తుండటం విశేషం.