నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైనా పరిక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం... విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే హాజరుకావాలని అధికారులు తెలిపారు... మొత్తం 38,666 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.... మొదటి సంవత్సరం విద్యార్థులు 19,337 మంది, ద్వితీయ 17,360 మంది, సప్లిమెంటరీకి 1,9690 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 45 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎలాంటి కాగితాలు వెంట తెచ్చుకోవద్దని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.