ఇంటర్ విద్యార్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కి రావాలని అధికారులు సూచించారు. కానీ... సికింద్రాబాద్‌లోని కీస హైస్కూల్లో 8.30 వరకూ... వాచ్‌మేన్ తప్ప స్కూల్ సిబ్బంది ఎవరూ రాలేదు. 9 గంటలకు ఎగ్జామ్. దాంతో విద్యార్థులు చాలా ఆందోళన చెందారు. చాలా మంది చదువుకున్నది మర్చిపోయారు. ఆ తర్వాత తీరిగ్గా వచ్చారు స్కూల్ సిబ్బంది. దాంతో విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులూ మండిపడ్డారు. విద్యార్థులు నిమిషం ఆలస్యమైతే... ఎగ్జామ్ రాయనివ్వరు కదా... మరి టీచర్లు, సిబ్బందీ ఆలస్యమైతే... ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు పేరెంట్స్.