పంజాగుట్ట మెట్రో రైల్వే స్టేషన్లో ‘స్కై వాక్’ సౌకర్యాన్ని పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సె్రటరీ అరవింద్ కుమార్ ప్రారంభించారు. మెట్రో స్టేషన్ నుంచి పంజాగుట్టలో ఉన్న మెట్రో మాల్ లోనికి ఈ స్కైవాక్ ద్వారా ప్రయాణికులు సులభంగా వెళ్లిపోవచ్చు. కార్యక్రమంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ అధికారులు పాల్గొన్నారు.