అణగారిన కులాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి చట్టపరమైన శిక్షలు పడవవని, తప్పుచేసిన వారు అణగారిన వారైతే వారిని కాల్చి చంపుతారని రుజువయ్యిందని మందకృష్ణ అన్నారు. అగ్రవర్ణాల వారికి మాత్రమే పరువు ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. అణగారిన ప్రజలకు ఆత్మగౌరవం ఉండదా? అని ఆందోళన వ్యక్తం చేశారు.