పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)కి వ్యతిరేకంగా హైదరాబాద్ పాతబస్తీలో భారీ ర్యాలీ జరిగింది. ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. తిరంగా ర్యాలీలో పాతబస్తీకి చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.